ఆర్ఎస్ఎస్ వర్కర్లపై దాడి.. బుల్డోజర్‌తో నిందితుడి ఇల్లు కూల్చివేత

పది మంది ఆర్ఎస్ఎస్ వర్కర్లపై కత్తితో దాడి చేసిన వ్యక్తి ఇల్లు ఆలయ స్థలంలో అక్రమంగా నిర్మించారని బుల్డోజర్‌తో కూల్చివేశారు. రాజస్తాన్‌లోని జైపూర్‌లోని ఆదివారం ఈ కూల్చివేత జరిగింది.

Update: 2024-10-20 13:26 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పది మంది ఆర్ఎస్ఎస్ వర్కర్లపై కత్తితో దాడి చేసిన వ్యక్తి ఇల్లు ఆలయ స్థలంలో అక్రమంగా నిర్మించారని బుల్డోజర్‌తో కూల్చివేశారు. రాజస్తాన్‌లోని జైపూర్‌లోని ఆదివారం ఈ కూల్చివేత జరిగింది. మూడు రోజుల క్రితం శరద్ పూర్ణిమ సందర్భంగా ఆలయంలో గురువారం రాత్రి జాగరణ కార్యక్రమాలు జరిగాయి. శబ్దాలు, పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో స్థానికులు కొందరు అక్కడ గొడవకు దిగారు కూడా. ఈ జాగరణ కార్యక్రమం జరుగుతుండగానే నసీబ్ చౌదరి, ఆయన కొడకు భీషం చౌదరి, మరికొందరు కలిసి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై కత్తులు, ఇతర ఆయుధాలతో దాడి చేశారు. ఈ దాడితో ఆరుగురు హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. దాడి జరిగిన మరుసటి రోజు కర్ణి విహార్ ఏరియాలో నిరసనలు చేశారు. నసీబ్ చౌదరి అక్రమంగా ఆలయ స్థలంలోని కొంత భాగం, పార్క్ స్థలాన్ని కబ్జా చేశాడని, అక్కడ ఓ చిన్న బిల్డింగ్ నిర్మించాడని, ఆయనపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. జైపూర్ డెవలప్‌మెంట్ అథారిటీ చౌదరికి నోటీసులు పంపి 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

ఆర్ఎస్ఎస్ వర్కర్లపై దాడి కేసులో పోలీసులు తండ్రీ కొడుకును శుక్రవారం అరెస్టు చేశారు. కాగా, తమకు సమాధానం రాలేదని పేర్కొంటూ జైపూర్ డెవలప్‌మెంట్ అథారిటీ సిబ్బంది బుల్డోజర్లు తెచ్చి అక్రమంగా నిర్మించిన ఇంటి భాగాన్ని ఆదివారం కూల్చివేశారు.

Tags:    

Similar News