ద్వేషపూరిత ప్రసంగం కేసులో ఆజంఖాన్‌ నిర్దోషి..

2019 నాటి ద్వేషపూరిత ప్రసంగం కేసులో సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజంఖాన్‌ను ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ కోర్టు బుధవారం నిర్దోషిగా ప్రకటించింది.

Update: 2023-05-24 14:51 GMT

రాంపూర్(ఉత్తరప్రదేశ్): 2019 నాటి ద్వేషపూరిత ప్రసంగం కేసులో సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజంఖాన్‌ను ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ కోర్టు బుధవారం నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో ఆయనను దోషిగా నిర్ధారిస్తూ కింది కోర్టు గత ఏడాది (2022లో) ఇచ్చిన తీర్పును న్యాయస్థానం తోసిపుచ్చింది. 2017లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆజాంఖాన్‌పై దాదాపు 87 కేసులు నమోదయ్యాయి. వీటిలో అవినీతి, దొంగతనం, భూకబ్జా కేసులే ఎక్కువగా ఉన్నాయి.

2019లో ఆజంఖాన్‌ మాట్లాడుతూ.. "దేశంలో ముస్లింల ఉనికి ప్రశ్నార్ధకం అయ్యే వాతావరణాన్ని ప్రధాని మోడీ సృష్టిస్తున్నారు" అని ఆరోపించారు. ఆ వ్యాఖ్యలకుగానూ యూపీ ప్రభుత్వం ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. ఇందులో దోషిగా నిర్ధారిస్తూ కోర్టు గత సంవత్సరం ఇచ్చిన తీర్పు వల్ల ఆజంఖాన్‌ ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు పడింది. 2022 డిసెంబరులో ఆజంఖాన్‌ ప్రాతినిధ్యం వహించే రాంపూర్ సదర్ స్థానంలో నిర్వహించిన బై పోల్‌లో బీజేపీ అభ్యర్థి ఆకాశ్ సక్సేనా గెలుపొందారు.

Tags:    

Similar News