సౌదీలో రేపు.. భారత్‌లో మంగళవారం నుంచి రంజాన్ మాసం షురూ

దిశ, నేషనల్ బ్యూరో : పవిత్ర మక్కా నగరానికి నెలవైన సౌదీ అరేబియాలో ఆదివారం రాత్రి నెలవంక కనిపించింది.

Update: 2024-03-10 17:51 GMT

దిశ, నేషనల్ బ్యూరో : పవిత్ర మక్కా నగరానికి నెలవైన సౌదీ అరేబియాలో ఆదివారం రాత్రి నెలవంక కనిపించింది. దేశంలోని సుడైర్, థుమైర్ ప్రాంతాల్లో నెలపొడుపు కనిపించినందున మరుసటి రోజు నుంచే రంజాన్ ప్రారంభమవుతుందని సౌదీ సుప్రీంకోర్టు ప్రకటించింది. దీంతో సౌదీ అరేబియా, యూఏఈ, ఆస్ట్రేలియా, యూకే, అమెరికా సహా పలు దేశాల్లోని ముస్లింలు సోమవారం నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభించనున్నారు. ఒమన్ మినహా అన్ని గల్ఫ్ దేశాల్లో మార్చి 11 నుంచే రంజాన్ ఉపవాస దీక్షలు మొదలవుతాయి. మంగళవారం నుంచి భారత్‌, పాకిస్తాన్, బంగ్లాదేశ్ తదితర దక్షిణాసియా దేశాల్లోని ముస్లింలు రంజాన్ ఉపవాస దీక్షలను ప్రారంభిస్తారు. రంజాన్ మాసంలో ప్రతి రోజూ ఉదయం సూర్యోదయానికి ముందే సహరీ (భోజనాలు) చేయడంతో ఉపవాస దీక్ష ప్రారంభమవుతుంది. అనంతరం రోజంతా ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. సాయంత్రం వేళ సూర్యాస్తమయం తర్వాత ఉపవాస దీక్షను విరమిస్తారు.

Tags:    

Similar News