త్వరలో భారత్‌లో కలవనున్న పాక్ : బాబా రామ్ దేవ్ జోస్యం
యోగా గురువు బాబా రామ్ దేవ్ దాయాది దేశం పాకిస్తాన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ,డైనమిక్ బ్యూరో: యోగా గురువు బాబా రామ్ దేవ్ దాయాది దేశం పాకిస్తాన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఆ దేశం త్వరలో నాలుగు భాగాలుగా విడిపోబోతోందని జోస్యం చెప్పారు. హరిద్వార్‌లోని పతంజలి యోగాపీఠ్ ప్రాంగణంలో గురువారం జరిగిన 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా బాబా రామ్‌దేవ్ పాకిస్థాన్‌పై విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ త్వరలో పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే), సింధ్, బలూచిస్తాన్, పంజాబ్ ప్రావిన్సులుగా విడిపోతుందని అన్నారు. ఆ తర్వాత పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్‌లో కలిసిపోతుందని.. ఇక సింధ్, పంజాబ్ ప్రావిన్స్‌లు భారత్‌తో సాంస్కృతికంగా పోలి ఉండేవి కాబట్టి అవి కూడా మనదేశంలో కలిసిపోతాయన్నారు. పాకిస్థాన్‌లోని నాలుగు ప్రావిన్సులు భారత్‌లో విలీనం కావడం వల్ల మన దేశంతో ప్రపంచ శక్తిగా అవతరించనుందన్నారు.