స్టేజీ ఎదైనా సరే.. నాటు నాటు ఆడాల్సిందే..
G20 కార్యక్రమం శ్రీనగర్ లో భారీ బందోబస్తు నడుమ అట్టహాసంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి దాదాపు అన్ని దేశాల నుంచి ముఖ్య నేతలు పాల్గొంటున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: G20 కార్యక్రమం శ్రీనగర్ లో భారీ బందోబస్తు నడుమ అట్టహాసంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి దాదాపు అన్ని దేశాల నుంచి ముఖ్య నేతలు పాల్గొంటున్నారు. ఈ క్రమంలో దక్షిణ కొరియా రాయబారి చాంగ్ జే-బోక్ కూడా వచ్చారు. అలాగే టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ కూడా అక్కడకు వచ్చాడు. ఆ సమయంలో క్షిణ కొరియా రాయబారి చాంగ్ జే-బోక్‌తో కలిసి రామ్ చరణ్ ఆస్కార్ విన్నింగ్ పాట 'నాటు నాటు'కి డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో.. నటుడు అంబాసిడర్‌కి పాట యొక్క హుక్ స్టెప్ నేర్పించడం కనిపించింది. ఈ కార్యక్రమంలో చరణ్ కాశ్మీర్ గురించి, ఆ స్థలంతో తనకు ఎలా అనుబంధం ఉంది అనే దాని గురించి మాట్లాడాడు.
Read More: OTT: ఈ వారం థియేటర్లు, ఓటిటిలో విడుదలయ్యే సినిమాలు, సిరీస్‌లు ఇవే