Gulf Country : ఎడారి దేశాల్లో నిన్న వానలు..నేడు మంచు
ఎడారి దేశాల్లో (Desert countries)నెలకొంటున్న వాతావరణ మార్పులు(Weather changes) ప్రపంచానికి గుబులు పుట్టిస్తు్న్నాయి.
దిశ, వెబ్ డెస్క్ : ఎడారి దేశాల్లో (Desert countries)నెలకొంటున్న వాతావరణ మార్పులు(Weather changes) ప్రపంచానికి గుబులు పుట్టిస్తు్న్నాయి. ఎడారి దేశం గల్ఫ్ లోని సౌదీ అరేబియా(Saudi Arabia)ఎడారులలో వరుసగా వస్తున్న మార్పులు శాస్త్రవేత్తలను సైతం కలవర పెడుతున్నాయి. సహజంగా ఇక్కడి ఎడారుల్లో్ విపరీతమైన ఎండలు మండుతుండటం అందరికి తెలిసిందే. అయితే, గత కొంత కాలంగా అక్కడ వాతావరణ పరిస్థితులు మారిపోగా, కొద్ది రోజుల క్రితం సౌదీ అరేబియాని వర్షాలు ముంచెత్తడం అందరిని అశ్చర్య పరిచింది. తాజాగా ఆ దేశంలో ఇప్పుడు భారీగా మంచు కురుస్తున్న తీరు మరింత విస్మయానికి గురి చేస్తోంది.
సౌదీలోని అల్-జౌఫ్ ప్రావిన్స్ సమీపంలో ఎడారుల్లో, రోడ్లపైన కురిసిన భారీ మంచు తెల్లటి దుప్పటి కప్పుకున్నట్లుగా పరుచుకుంది.ఈ ప్రాంతం ఇంతకుముందు ఏడాదంతా పొడి వాతావరణంలో ఎండలతో ఉండేది. అందుకు భిన్నంగా వానలు, మంచు కురవడంతో ఎందుకీ వాతావరణ మార్పులు చోటుచేసుకున్నాయోనంటూ స్థానికులు ఆందోళన చెందుతుండగా, శాస్త్రవేత్తలు పరిశోధనలకు పదును పెడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న గ్లోబల్ వార్మింగ్ పరిస్థితులే ప్రస్తుత వాతావరణ మార్పులకు కారణమని భావిస్తున్నారు.