India Railway : ఇంజిన్, బోగీ మధ్య చిక్కుకుని రైల్వే ఉద్యోగి దుర్మరణం

బిహార్‌లో ఇంజిన్, బోగీల మధ్య కప్లింగ్‌ను విడదీయడానికి వెళ్లిన రైల్వే ఉద్యోగి స్పాట్‌లోనే మరణించాడు. లోకో పైలట్ హఠాత్తుగా ఇంజిన్‌ను వెనక్కి పోనివ్వడంతో బోగీ, ఇంజిన్ మధ్య ఆ రైల్వే ఉద్యోగి ఇరుక్కుని మరణించాడు.

Update: 2024-11-09 18:43 GMT
India Railway : ఇంజిన్, బోగీ మధ్య చిక్కుకుని రైల్వే ఉద్యోగి దుర్మరణం
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్‌(Bihar)లో ఇంజిన్, బోగీల మధ్య కప్లింగ్‌ను విడదీయడానికి వెళ్లిన రైల్వే ఉద్యోగి(Railway Employee) స్పాట్‌లోనే మరణించాడు. లోకో పైలట్ హఠాత్తుగా ఇంజిన్‌(Engine)ను వెనక్కి పోనివ్వడంతో బోగీ, ఇంజిన్ మధ్య ఆ రైల్వే ఉద్యోగి ఇరుక్కుని మరణించాడు. బిహార్‌ బెగుసరాయి జిల్లాలోని బరౌనీ జంక్షన్‌లో శనివారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతుడిని రైల్వే ఉద్యోగి అమర్ కుమార్ రౌత్(35)గా గుర్తించారు. లక్నో-బరౌనీ ఎక్స్‌ప్రెస్ గమ్యం చేరుకున్న తర్వాత బరౌనీ జంక్షన్‌లో డీకప్లింగ్ చేయడానికి అమర్ వెళ్లాడు. ట్రైన్ డ్రైవర్ అనుకోకుండా ఇంజిన్ రివర్స్ చేయడంతో అమర్ మరణించాడు. ప్రయాణికుల నుంచి విషయం తెలుసుకున్న లోకో పైలట్ స్పాట్ నుంచి పరారయ్యాడు. ఘటన గురించి తెలియగానే సోన్‌పూర్ రైల్వే డివిజన్ సీనియర్ అధికారులు స్పాట్‌కు చేరుకుని ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.

Tags:    

Similar News