Coromandel express accident : ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆ ట్రైన్స్ అన్ని రద్దు చేసిన రైల్వే శాఖ!

ఒడిషాలో శుక్రవారం రాత్రి కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.

Update: 2023-06-03 03:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఒడిషాలో శుక్రవారం రాత్రి కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. వేగంగా దూసుకెళ్తున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆగి ఉన్న మరో గూడ్స్ ట్రైన్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ బోగీలు పట్టాలపై చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో ఆ రూట్‌లో ప్రయాణించే రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఈ నేపథ్యంలో ఆ మార్గంలో వెళ్లే పలు రైళ్లను రద్దు చేస్తూ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 18 దూరప్రాంత రైళ్లను రద్దు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. హౌరా-హైదరాబాద్ (18045), హౌరా-తిరుపతి (20889), హౌరా-పూరీ సూపర్‌ఫాస్ట్ (12837), హౌరా-బెంగళూరు సూపర్ ఫాస్ట్ (12893), హౌరా-పూరీ సూపర్‌ఫాస్ట్ (12895), హౌరా-సంబల్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (20831), హౌరా-చెన్నై మెయిల్ (12839), హౌరా-సికింద్రాబాద్ (12703), సంత్రగాచి-పూరీ ఎక్స్‌ప్రెస్ (02837) తదితర రైళ్లను తాత్కలికంగా రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు.

ఈ రూట్‌లలో నడిచే మరికొన్ని సర్వీస్‌లను దారి మళ్లించినట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యమ్నాయ మార్గాలు చూసుకోవాలని కోరారు. ఇక, ఘటన స్థలంలో సహయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 233 మంది మృతి చెందగా.. దాదాపు 1000 మంది వరకు గాయపడినట్లు సమాచారం. అంతేకాకుండా దాదాపు మరో 600 మంది ప్రయాణికులు ఇంకా రైలు బోగీల్లోనే చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

 

Also Read...

కోరమండల్ రైలు ప్రమాద ఘటన దురదృష్టకరం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 

Tags:    

Similar News