ఇది చాలా సీరియస్.. చైనా ప్రామాణిక మ్యాప్ పై రాహుల్ గాంధీ
గత కొన్ని రోజులుగా లడాక్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ.. బుధవారం కర్ణాటకకు బయలుదేరుతున్నప్పుడు చైనా విడుదల చేసిన మ్యాప్ పై పలు ప్రశ్నలు వేశారు.
దిశ, వెబ్‌డెస్క్: గత కొన్ని రోజులుగా లడాక్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ.. బుధవారం కర్ణాటకకు బయలుదేరుతున్నప్పుడు చైనా విడుదల చేసిన మ్యాప్ పై పలు ప్రశ్నలు వేశారు. దీంతో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. “నేను లడఖ్ నుండి ఇప్పుడే తిరిగి వచ్చాను మరియు లడఖ్‌లో ఒక్క అంగుళం భూమి కూడా కోల్పోలేదని ప్రధానమంత్రి చెప్పిన విషయం చాలా సంవత్సరాలుగా చెబుతున్నాను. ఒక సంపూర్ణ అబద్ధం. చైనా మన భూమిని ఆక్రమించిందని లడఖ్ మొత్తానికి తెలుసు. అని చెప్పుకొచ్చాడు. అలాగే "ఈ మ్యాప్ సమస్య చాలా తీవ్రమైనది. కాగా అరుణాచల్ ప్రదేశ్ మరియు అక్సాయ్ చిన్‌లను చైనా మ్యాప్‌లో చేర్చడంపై కాంగ్రెస్ మంగళవారం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.