బీహార్ ఇకపై మౌనంగా ఉండదు.. ర్యాలీపై రాహుల్ గాంధీ ట్వీట్
బీహార్‌లోని బెగుసరాయ్ లో ఎన్ఎస్‌యూఐ ఏర్పాటు చేసిన "వలసలను ఆపండి, ఉద్యోగాలు కల్పించండి" యాత్రలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ ర్యాలీ బీహార్ యువతకు న్యాయం, ఉపాధి అవకాశాల కోసం జరుగుతున్న పోరాటంగా చెబుతున్నారు.
దిశ, వెబ్ డెస్క్: బీహార్‌లోని బెగుసరాయ్ (Begusarai)లో ఎన్ఎస్‌యూఐ ఏర్పాటు చేసిన "వలసలను ఆపండి, ఉద్యోగాలు కల్పించండి" యాత్రలో రాహుల్ గాంధీ (Rahul Gandhi) పాల్గొన్నారు. ఈ ర్యాలీ బీహార్ యువతకు న్యాయం, ఉపాధి అవకాశాల కోసం జరుగుతున్న పోరాటంగా చెబుతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా బీహార్ యువత సమస్యలను, వారి సంఘర్షణను ప్రపంచానికి చూపించడం లక్ష్యంగా పెట్టుకొని నిర్వహించారు. అయితే ఈ సంవత్సరం చివరల్లో బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ ర్యాలీలో పాల్గొనడం ప్రత్యేకతను సంతరించుకుంది.
అయితే ఈ ర్యాలీను ప్రారంభించిన రాహుల్ గాంధీ (Rahul Gandhi) వారితో కలిసి పాదయాత్రగా ముందుకు సాగారు. అనంతర బీహార్ ర్యాలీపై ట్విట్టర్‌లో ఇలా రాసుకొచ్చారు. "బీహార్ యువతకు ఏదైనా సాధించాలనే కోరిక, ఉద్యోగ అవకాశాల కల్పనకు మద్దతు ఇవ్వనందుకు ప్రభుత్వంపై వారికి కోపం ఉంది."వలసలను ఆపండి, ఉద్యోగాలు కల్పించండి" అనే మార్చ్‌లో, వేలాది మంది యువకుల భావోద్వేగాలు, బాధ, దృఢ సంకల్పం ఈరోజు బెగుసరాయ్ వీధుల్లో స్పష్టంగా కనిపించాయి. నిరుద్యోగం, వలసలకు వ్యతిరేకంగా ఈ స్వరం ఇప్పుడు మార్పు కోసం పిలుపు గా మారింది. బీహార్ ఇకపై మౌనంగా ఉండదు. యువత ఇకపై అన్యాయాన్ని సహించదు. వారు తమ హక్కులు, ఉపాధి. న్యాయం కోసం దృఢంగా పోరాడుతారు." అని రాసుకొచ్చారు.