కర్ణాటక ఎన్నికల్లో రాహుల్ గాంధీ వినూత్న ప్రచారం

కర్ణాటక ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. దీంతో బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు ఆయా పార్టీలు ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి.

Update: 2023-05-08 06:05 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. దీంతో బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు ఆయా పార్టీలు ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ సహా ఇతర నేతలంతా ఇప్పటికే రోడ్ షోలు నిర్వహించారు. తమ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని కోరుకున్నారు. నేటితో ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో రాహుల్ గాంధీ బెంగళూరులో వినూతంగా ప్రచారం నిర్వహించారు. రాత్రి కన్నింగ్‌హామ్ రోడ్‌లోని కేఫ్ కాఫీ డే అవుట్‌లెట్‌‌లో బస చేసిన రాహుల్ గాంధీ ఇవాళ ఉదయాన్నే నిద్ర లేచి BMTC బస్సులో ప్రయాణం చేశారు. బస్సులో ప్రయాణం చేస్తున్న మహిళలతో ముచ్చటించారు. పెరుగుతున్న నిత్యావసర ధరలు, గృహలక్ష్మి పథకం, బీఎమ్‌టీసీ, కేఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వంటి కాంగ్రెస్ హామీలను వారికి వివరించారు.

అలాగే కేఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లోనూ ప్రయాణం చేశారు. గృహలక్ష్మి పథకం రూ.2 వేలు ఇస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఆర్టీసీ రవాణా సమస్యలను రాహుల్ గాంధీ దృష్టికి కొందరు మహిళలు తీసుకెళ్లారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన రాహుల్ గాంధీ.. తాము అధికారంలో ప్రత్యేక బడ్జెట్ పెడతామని హామీ ఇచ్చారు. ఇక లింగరాజపురంలో బస్సు దిగిన రాహుల్ గాంధీ.. అక్కడ బస్టాప్ వద్ద ఉన్న మహిళలతోనూ మాట్లాడారు.

కాగా మే 10 కర్ణాటకలో సాధారణ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. అన్ని పోలింగ్ బూత్ వద్ద 100 మీటర్ల మేరకు 144 సెక్షన్ అమలు చేయనున్నారు. అటు పోలింగ్ దృశ్యాలను వెబ్ కేమ్‌లతో రికార్డు చేయనున్నారు. ఈ నెల 13న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.

Tags:    

Similar News