కాంగ్రెస్కు బిగ్ షాక్.. ఆ కేసులో రాహుల్ గాంధీకి కోర్టు నోటీసులు

కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మోడీ ఇంటి పేరు పరువు నష్టం కేసులో ఎంపీ పదవి కోల్పోయిన రాహుల్ గాంధీపై మరో పరువు నష్టం కేసు దాఖలైంది.

Update: 2023-06-14 13:38 GMT
Rahul Gandhi Sircilla Visit Postponed
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మోడీ ఇంటి పేరు పరువు నష్టం కేసులో ఎంపీ పదవి కోల్పోయిన రాహుల్ గాంధీపై మరో పరువు నష్టం కేసు దాఖలైంది. ఆయనతో పాటు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ లకు బెంగళూరు చీఫ్ మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ నోటీసులు జారీ చేశారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మే 5, 2023లో పేపర్లలో యాడ్స్ ఇచ్చింది. అందులో కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం 40 పర్సెంట్ కరప్షన్ తో రూ.1.5 లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని ప్రచారం చేశారు.

దీన్ని సవాలు చేస్తూ కర్ణాటక బీజేపీ సెక్రటరీ కేశవప్రసాద్ మే 9, 2023న పరువు నష్టం దావా వేశారు. ఇవాళ ఆ కేసును విచారించిన బెంగళూరు మెట్రోపాలిటన్ కోర్టు రాహుల్ గాంధీ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లకు సమన్లు జారీ చేసింది.  తదుపరి విచారణను జులై  27కు  వాయిదా వేసింది.

Tags:    

Similar News