నాకూ పెళ్లి చేసుకోవాలని ఉంది.. పిల్లలను కనాలనీ ఉంది... కానీ,....

రాబోయే ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఓడించగలమని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ జోస్యం... Rahul Gandhi Says PM Modi "Can Be Defeated" In 2024 Polls, If...

Update: 2023-02-21 16:46 GMT
నాకూ పెళ్లి చేసుకోవాలని ఉంది.. పిల్లలను కనాలనీ ఉంది... కానీ,....
  • whatsapp icon

న్యూఢిల్లీ: రాబోయే ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఓడించగలమని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు. ఇటాలియన్ డెయిలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పారు. తన పెళ్లి గురించి ప్రస్తావన రాగా, పిల్లలు కూడా కావాలనే ఆసక్తి ఉన్నట్లు చెప్పారు. తనకు ఇప్పటివరకు పెళ్లి ఎందుకు కాలేదనే విషయంపై తనకు అవగాహనా లేదని చెప్పారు. తాను తన నానమ్మ ఇందిరాగాంధీకి ఇష్టమని, తన సోదరి ప్రియాంక అంటే ఇటాలియన్ నానమ్మకు ఇష్టమని తెలిపారు. ప్రజాస్వామ్య నిర్మాణాలు కుప్పకూలడం, పార్లమెంట్ సక్రమంగా పనిచేయకపోవడంతో ఫాసిజం దేశంలోకి ప్రవేశించిందని గాంధీ ఆరోపించారు. దేశాన్ని స్థాపించిన ఆలోచనను రక్షించాలని చెప్పారు. తమ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో కుటుంబ సభ్యులను కోల్పోయామని కూడా చెప్పారు. దేశంలో శాంతి ఐక్యత కోసం పోరాడుతున్నామని, మోడీకి ఓటమి ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. ఆయనను ఓడించగలమని తెలిపారు.

Tags:    

Similar News