చెల్లి ప్రియాంక గాంధీ విజయం పై స్పందించిన అన్న రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ రాజీనామాతో వయనాడ్ పార్లమెంట్ (Wayanad Parliament) స్థానానికి.. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.

Update: 2024-11-23 13:29 GMT

దిశ, వెబ్ డెస్క్: రాహుల్ గాంధీ రాజీనామాతో వయనాడ్ పార్లమెంట్ (Wayanad Parliament) స్థానానికి.. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు.. ఈ రోజు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో అందరూ ఊహించినట్లుగానే ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) భారీ విజయం సాధించారు. ఈ ఉప ఎన్నికల్లో.. తన చెల్లి ప్రియాంక గాంధీ విజయం పై అన్న రాహుల్ గాంధీ(Rahul Gandhi) ట్విట్టర్ వేదికగా స్పందించారు. తన ట్వీట్‌లో "వాయనాడ్‌లోని నా కుటుంబం ప్రియాంకపై నమ్మకం ఉంచినందుకు నేను చాలా గర్వపడుతున్నాను.

ఆమె మన ప్రతిష్టాత్మకమైన వయనాడ్‌(Wayanad)ను ప్రగతి, శ్రేయస్సు యొక్క దీపస్తంభం గా మార్చడానికి ధైర్యం, కరుణ, అచంచలమైన అంకితభావంతో నడిపిస్తుందని నాకు తెలుసు" అని రాసుకొచ్చారు. కాగా 2024 పార్లమెంట్ ఎన్నికల్లో రెండు స్థానాల్లో రాహుల్ గాంధీ పోటీ చేయగా.. రెండింటిలోను విజయం సాధించారు. ఈ క్రమంలో ఆయన వయనాడ్ పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయగా.. ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. ఈ క్రమంలో మొట్ట మొదటి సారి ఎన్నికల బరిలో నిలిచిన ప్రియాంక గాంధీ.. గతంలో రాహుల్ గాంధీ సాధించిన మెజార్టీ కంటే ఎక్కువ మెజారిటీ సాధించి చరిత్రలో నిలిచిపోయే మొదటి విజయాన్ని అందుకున్నారు.

Tags:    

Similar News