రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో ఓ స్టాండప్ కమెడియన్‌: ఎంపీ కంగనా రనౌత్

సోమవారం పార్లమెంట్ సమావేశాల్లో రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా మాట్లాడుతూ.. హిందువుల పేరుతో హింస, ద్వేషాన్ని పెంపోందిస్తున్నారని వ్యాఖ్యానించగా.. సభ మొత్తం దద్దరిల్లింది.

Update: 2024-07-01 12:59 GMT

దిశ, వెబ్ డెస్క్: సోమవారం పార్లమెంట్ సమావేశాల్లో రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా మాట్లాడుతూ.. హిందువుల పేరుతో హింస, ద్వేషాన్ని పెంపోందిస్తున్నారని వ్యాఖ్యానించగా.. సభ మొత్తం దద్దరిల్లింది. కాగా రాహుల్ వ్యాఖ్యలపై సభ అనంతరం బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె రాహుల్ గాంధీని పార్లమెంట్ స్టాండప్ కమెడియన్ అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆయన సభలో చేసిన కామెడీ కి ఇప్పటికి నవ్వుకుంటున్నామని.. అతను హిందువలపై చేసిన తన ప్రకటనలకు క్షమాపణ చెప్పాలని నేను భావిస్తున్నానని మీడియాతో చెప్పుకొచ్చారు. 


Similar News