Rahul Gandhi: పదేళ్లలో 70 సార్లు పేపర్ లీకేజీలు
దేశంలో పదేళ్లలో 70 సార్లు పేపర్ లీకేజీలు జరిగాయని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు.
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో పదేళ్లలో 70 సార్లు పేపర్ లీకేజీలు జరిగాయని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. సోమవారం లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం వల్ల అంబానీ, ఆదానీలకే న్యాయం జరుగుతోందని అన్నారు. దేశాన్ని నిరుద్యోగం, పేపర్ లీకేజీ చక్రవ్యూహంలో ఉంచారని మండిపడ్డారు. నిరుద్యోగులకే బడ్జెట్‌లో చేసిందేమీ లేదని అన్నారు. దళితులు, మహిళలు, మైనార్టీలు, ఆదివాసీలకు సైతం బడ్జెట్‌లో కేటాయింపులు లేవని తెలిపారు. ఈ క్రమంలో బీజేపీ సభ్యులు కలుగజేసుకొని.. రాహుల్ సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. దేశంలో భయానక వాతావరణం ఉంది. పెద్ద పారిశ్రామిక వ్యాపారవేత్తలను ప్రోత్సహించి గుత్తాధిపత్యం కట్టబెడుతున్నారని అన్నారు. పద్మవ్యూహం కమలం పార్టీ రూపంలో దేశంలో ఉంది. అప్పుడు పద్మవ్యూహాన్ని ఆరుగురు కంట్రోల్ చేశారు. ఇప్పుడు మోడీ, అమిత్ షా, మోహన్ భగవత్ కంట్రోల్ చేస్తున్నారని కీలక ఆరోపణలు చేశారు.