వినేశ్ ఫొగట్‌ ఇంటికి పంజాబ్ ముఖ్యమంత్రి

నోటికాడి ముద్ద నేల పాలైనట్లు.. మెడల్ సాధిస్తుందని అంతా అనుకున్న సమయంలో వినేశ్‌ ఫొగట్‌కు అనూహ్య పరిణామం ఎదురైంది.

Update: 2024-08-07 14:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: నోటికాడి ముద్ద నేల పాలైనట్లు.. మెడల్ సాధిస్తుందని అంతా అనుకున్న సమయంలో వినేశ్‌ ఫొగట్‌కు అనూహ్య పరిణామం ఎదురైంది. 100 గ్రాముల అధిక బరువు కారణంగా ఆమెపై ఒలంపిక్ కమిటీ అనర్హత వేటు వేసింది. దీంతో ఆమెకు దేశం మొత్తం అండగా నిలుస్తోంది. అనర్హత వేటు వెనుక కుట్ర దాగుందని సోషల్ మీడియా వేదికగా అందరూ పోస్టులు పెడుతున్నారు. ఇదిలా ఉండగా.. వినేశ్ ఫొగట్ కుటుంబాన్ని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పరామర్శించారు. హర్యాణాలోని చర్కిదాద్రిలో ఉన్న ఆమె ఇంటికి స్వయంగా వెళ్లి తల్లిదండ్రులను ఓదార్చారు. ‘కోచ్‌లు, ఫిజియోలు రూ. లక్షల జీతం తీసుకుంటున్నారు. వారు దగ్గరుండి ఆమె బరువును పరిశీలించాలి కదా’ అని సీఎం ఎదుట తల్లిదండ్రులు ఆవేదన చెందారు. వినేశ్‌కు జరిగిన అన్యాయాన్ని అడ్డుకోవాలని, రాజకీయాలతో సంబంధం లేకుండా అందరూ న్యాయం కోసం పోరాడాలని అన్నారు. మరోవైపు వినేశ్‌ ఫొగట్‌కు అందరూ అండగా నిలవాలని భార‌త రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము కోరారు. 140 కోట్ల ప్రజల హృదయాల్లో ఫొగట్‌ ఛాంపియన్‌గా నిలిచార‌న్నారు. ఈ స‌మ‌యంలో ఫొగట్‌కు అందరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News