ఈడీ ఛార్జిషీట్‌లో ప్రియాంక గాంధీ పేరు

కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీకి ఈడీ షాక్ ఇచ్చింది. మనీ లాండరింగ్ కేసులో ప్రియాంక గాంధీ వాద్రా పేరును ఎన్ పోర్స్ మెంట్ డైరెక్టరేట్ తొలిసారి ప్రస్తావించింది.

Update: 2023-12-28 07:35 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీకి ఈడీ షాక్ ఇచ్చింది. మనీ లాండరింగ్ కేసులో ప్రియాంక గాంధీ వాద్రా పేరును ఎన్ పోర్స్ మెంట్ డైరెక్టరేట్ తొలిసారి ప్రస్తావించింది. ఎన్ఆర్‌ఐ వ్యాపారవేత్త సీసీ తంపితో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఇటీవలే ఛార్జ్ షీట్ లో ప్రియాంక గాంధీ భర్త రాబర్డ్ వాద్రా పేరును ఈడీ పేర్కొనగా గురువారం తొలిసారి ప్రియాంక గాంధీ పేరును ప్రస్తావించింది. ప్రియాంక గాంధీ భర్త రాబర్డ్ వాద్రా 2006లో ఫరీదాబాద్ ప్రాంతంలోని అమీపూర్ గ్రామంలో రియల్ ఎస్టేట్ ఏజెంట్ హెచ్ఎల్ పహ్వా ద్వారా 40 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు.

2010లో అదే భూమిని తిరిగి పహ్వాకు అమ్మేశారు. అలాగే 2006లో అమీపూర్ గ్రామంలో హెచ్ఎల్ పహ్వా ద్వారా.. ప్రియాంక గాంధీ ఓ ఇంటిని కొనుగోలు చేసి 2010లో అదే ఇంటిని తిరిగి పహ్వాకు అమ్మేశారు. ఈ భూముల కొనుగోలు సమయంలో జరిగిన ఆర్థిక లావాదేవీలు అన్ని విదేశాల నుంచి అక్రమంగా వచ్చాయని ఈడీ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంలో ఈడీ తాజాగా ప్రియాంక గాంధీ పేరును ఛార్జిషీట్ లో నమోదు చేయడం ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News