Priyanka Gandhi : ఖర్గేను కలిసిన ప్రియాంక గాంధీ

వయనాడ్(Wayanad)లోక్ సభ స్థానం ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ(Priyanka Gandhi)విజయం అనంతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే(Mallikarjun Kharge)ను కలిశారు

Update: 2024-11-23 11:38 GMT

దిశ, వెబ్ డెస్క్ : వయనాడ్(Wayanad)లోక్ సభ స్థానం ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ(Priyanka Gandhi)విజయం అనంతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే(Mallikarjun Kharge)ను కలిశారు. ఖర్గే నివాసానికి వెళ్లి మిఠాయిలు తినిపించారు. తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగి వయనాడ్ ఎంపీగా గెలిచి లోక్ సభలో అడుగుపెట్టబోతున్న ప్రియాంక గాంధీని ఖర్గే శాలువతో సత్కరించి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. జార్ఖండ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి విజయం సాధించడం పట్ల ఖర్గేను ప్రియాంక ప్రశంసించారు.

అంతకుముందు తనను భారీ మెజార్టీతో గెలిపించిన వయనాడ్ ప్రజలకు ప్రియాంక గాంధీ కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి రికార్డు మెజారిటీతో గెలిపించిన వయనాడ్ ప్రజల వ్యక్తిగా మీ ఆశలు, కలలను అర్థం చేసుకుంటానని, మీ కోసం పోరాడుతాను అంటూ ఎక్స్ లో వెల్లడించారు. తన సోదరుడు రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీయైన వయనాడ్ స్థానంలో రాహుల్ కంటే అధిక మెజార్టీతో ప్రియాంక విజయం సాధించడం విశేషం.


Read More..

Priyanka Gandhi: నాపై ఉంచిన నమ్మకానికి పొంగిపోయాను.. గెలుపు తర్వాత ప్రియాంక రియాక్షన్ 

Tags:    

Similar News