Priyanka: వయనాడ్ విషాదంపై కేంద్రం రాజకీయం.. ప్రియాంకా గాంధీ తీవ్ర విమర్శలు
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు.
దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం(Central government)పై కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) తీవ్ర విమర్శలు గుప్పించారు. కేరళలోని వయనాడ్ (Wayanad)లో కొండచరియలు విరిగిపడి వందలాది మంది ప్రాణాలు కోల్పేతే, బీజేపీ మాత్రం ఈ అంశంపై రాజకీయాలు(Politics) చేస్తోందని మండిపడ్డారు. ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా సోమవారం సుల్తాన్ బతేరి(sulthan batheree) నియోజకవర్గంలో ఆమె ప్రసంగించారు. ‘ప్రజలకు ఎంతో బాధ కలిగించిన విపత్తును కూడా బీజేపీ రాజకీయం చేసింది. దేశ ప్రజలు ఎలాంటి రాజకీయాలు కోరుకుంటున్నారో వాటి గురించి ఆలోచించాల్సిన తరుణంలో మేము నిలబడి ఉన్నాం’ అని తెలిపారు. బాధితులుగా మారిన వారిని ఆదుకునేందుకు నిధులు అందించడంలో కాషాయ పార్టీ తీవ్రంగా విఫలమైందన్నారు. ద్వేషం, కోపం, విభజన, విధ్వంసంతో కూడిన అంశాల మీదే బీజేపీ పాలిటిక్స్ ఉంటాయని మండిపడ్డారు. ప్రజలు ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలను విస్మరిస్తోందని వ్యాఖ్యానించారు. నిరుద్యోగం(Un employment) రోజు రోజుకూ పెరుగుతున్న దాని గురించి ఏనాడూ ఆలోచించడం లేదని విమర్శించారు. పార్లమెంటు(Parliment)లో ప్రాతినిధ్యం వహించడానికి అవకాశం ఇస్తే, ప్రజల తరఫున గళం విప్పుతానని నొక్కి చెప్పారు.