Prithvi-2: విజయవంతమైన పృథ్వీ-2 క్షిపణి పరీక్ష.. ప్రత్యేకతలు ఇవే!
న్యూక్లియర్ బాలిస్టిక్ క్షిపణి పృథ్వీ-2 ను భారత్ విజయవంతంగా పరీక్షించింది.
దిశ, వెబ్ డెస్క్: న్యూక్లియర్ బాలిస్టిక్ క్షిపణి పృథ్వీ-2 ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణిని ఒడిషా తీరంలో ప్రయోగించారు. అయితే ఈ పృథ్వీ-2 వెర్షన్ ను DRDO తయారు చేసింది. దీని యొక్క పరిధి 350 కిలోమీటర్లు. ఇది మన దేశంలో అభివృద్ధి చేసిన స్వదేశీ క్షిపణి కావడం విశేషం. గతేడాది జనవరిలో కూడా ఒడిషా తీరం నుంచి వ్యూహాత్మక స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పృథ్వీ-2 ను విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ శాఖ అప్పట్లో ప్రకటించింది. ఈ క్షిపణి అనేది భారత అణ్వాయుధాలలో ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. దీని ప్రత్యేకతలు.. ఉపరితలం నుంచి ఉపరితలానికి 350 కిలోమీటర్ల పరిధిని కలిగివుండి, చాలా ఎక్కువ స్థాయిలో ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించగలదు. దీంతో పాటు ఆయుధాలను మోసుకెళ్లే సామర్ధ్యాన్ని కూడా కలిగి ఉంది. కాగా 9 మీటర్ల పొడవు గల ఈ పృథ్వీ క్షిపణి 2003 నుండే భారత సైన్యంలో ఉంది.