చివరి దశ ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు

ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-05-28 07:08 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:దేశంలో సార్వత్రిక ఎన్నికలు కొనసాగుతున్నాయి. జూన్ 1వ తేదీన చివరి దశ పోలింగ్ జరగనున్నది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఎన్ఐ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల ఫలితాలు దేశాన్ని సరికొత్త మార్గంలో చూపిస్తాయన్నారు. కేవలం అవినీతిపరులే నన్ను విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీనే మైనార్టీలకు పెద్ద శత్రువు అని ఆరోపించారు. ఎవరైతే తాము దళితులు, ఆదివాసులు, శ్రేయోభిలాషులమని చెప్పుకుంటారో వాస్తవంగా వారే పెద్ద శత్రువులు. చాలా మంది ఎన్నో కలలు కంటూ వాగ్ధానాలు చేస్తున్నారని వారికి ఇవే చివరి ఎన్నికలు అని సెటైర్ వేశారు. ప్రతిపక్షాలు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నాయని విమర్శలు గుప్పించారు.

రిజర్వేషన్లపై దేశ ప్రజలను జాగృత చేసేందుకే నేను మాట్లాడానని, ఎస్సీ, ఎస్టీ, బీసీలను విపక్ష, నేతలు చీకట్లో ఉంచాలనుకుంటున్నారని మండిపడ్డారు. మరోసారి బీజేపీ వస్తే రిజర్వేషన్లు తొలగిస్తారని జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ.. మత ప్రాతిపదికన ముస్లింలకు రిజర్వేషన్లు రిజర్వేషన్లు ఇవ్వాలని తొలుత ఉమ్మడి ఏపీలో ప్రయత్నం జరిగింది. కానీ కోర్టులు వాటిని అడ్డుకున్నాయి. ఎందుకంటే మతపరమైన రిజర్వేషన్లను రాజ్యాంగం అంగీకరించదన్నారు. దళితులు, ఆదివాసుల కోసం పని చేస్తామని చెప్పుకునే వారు రాత్రికి రాత్రి అనేక విద్యా సంస్థలను మైనార్టీ సంస్థలుగా మార్చారు. యూనివర్సిటీలకు మైనార్టీ స్టేటస్ ఇచ్చారని విమర్శించారు. 10 వేల విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు లేకుండా చేశారన్నారు.

ఓటుబ్యాంక్‌ రాజకీయాల కోసం టీఎంసీ కోర్టులను దూషిస్తోంది. ఢిల్లీ సీఎం అరవింద్ ఎద్దేవా చేశారు. బెంగాల్ కర్నాటక ప్రభుత్వాలు ఓబీసీలకు అన్యాయం చేస్తున్నాయని, బెంగాల్ లో దొడ్డిదారిన మైనార్టీ కోటా తీసుకువచ్చారని ధ్వజమెత్తారు. ఒడిశా సంక్షేమం కోసమే ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ తో రిలేషన్ ను త్యాగం చేశానని చెప్పారు. మోడీ 3.0 సర్కార్ లో 'వికసిత్ భారత్' అనే వన్ పాయింట్ ఎజెండాతో ముందుకు వెళ్తామన్నారు. ఈసారి బీజేపీకి అత్యధిక స్థానాలు వచ్చే రాష్ట్రంలో కూడా పశ్చిమబెంగాల్ నిలవబోతున్నదని జ్యోసం చెప్పారు. 24 ఏళ్ల నుంచి ప్రతిపక్షాలు తనను దూషిస్తున్నాయని, గత ఎన్నికల్లో మౌత్ కా సౌదాగర్, గందీ నాలీ కా కీడ అనే వ్యక్తిగత దూషణలు ఎదుర్కొన్నానని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News