కొత్త పార్లమెంట్‌లో ప్రధాని మోడీ కీలక ప్రకటన
భారత నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఆదివారం జరిగిన ఈ ప్రారంభోత్సవంలో దేశంలోని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ఎంపీలు పాల్గొన్నారు.
దిశ, వెబ్‌డెస్క్: భారత నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఆదివారం జరిగిన ఈ ప్రారంభోత్సవంలో దేశంలోని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ఎంపీలు పాల్గొన్నారు. అనంతరం పార్లమెంట్‌ను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. పాత పార్లమెంట్ భవనంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని అన్నారు. కేవలం సీటింగ్ సమస్యే కాకుండా.. సాంకేతికంగానూ ఇబ్బందులు ఉండేవని గుర్తుచేశారు. రానున్న రోజుల్లో ఎంపీల సంఖ్య పెరుగుతుందని, అందుకు తగ్గట్లుగానే అత్యాధునిక వసతులతో కొత్త భవనం నిర్మించామని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పార్లమెంట్‌ను 1272 మంది కెపాసిటీతో నిర్మించినట్లు తెలిపారు.
Also Read..
New parliament building inauguration : సెంగోల్ (రాజదండం) ప్రత్యేకతలివే..!