దేశ చరిత్రలో ‘వందే భారత్’ ఓ విప్లవం: ప్రధాని మోడీ

ప్రధాని మోడీ జార్ఖండ్‌ రాష్ట్రం టాటానగర్‌‌లో పర్యటించారు....

Update: 2024-09-15 08:32 GMT

దిశ, వెబ్ డెస్క్: భారతీయ రైల్వే (Indian Rail ways) చరిత్రలో వందే భారత్ రైళ్లు విప్లవాత్మకమైనవని ప్రధాని మోడీ (Pm Modi) పేర్కొన్నారు. జార్ఖండ్‌ రాష్ట్రం టాటానగర్‌ (Tata Nagar)లో ఆరు కొత్త వందేభారత్ రైళ్ల(Six New Vande Bharat Trains)ను వర్చువల్ విధానంలో జెండా ఊపి ఆయన ప్రారంభించారు. దేశంలో రైల్వే వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు కృషి చేస్తున్నామని మోడీ తెలిపారు. ప్రాంతాల మధ్య కనెక్టివిటీని పెంచడం వల్లే అభివృద్ధి సులభతరం అవుతుందని చెప్పారు. గతం కంటే రైల్వే ప్రాజెక్టులకు అధిక నిధులు కేటాయిస్తు్న్నామని ప్రధాని మోడీ తెలిపారు.


కాగా మోడీ ప్రారంభించిన కొత్త రైళ్లు టాటానగర్ - పాట్నా, భాగల్పూర్ - దుమ్కా - హౌరా, బ్రహ్మపూర్ - టాటానగర్, గయా - హౌరా, డియోఘర్ - వారణాసి మరియు రూర్కెలా - హౌరాతో సహా వివిధ మార్గాల్లో రాకపోకలు సాగించనున్నాయి. ప్రాంతాల మధ్య కనెక్టివిటీని పెంచేందుకు ఆరు కొత్త వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.


Similar News