ఎట్టకేలకు నీట్ ఇష్యూపై నోరు విప్పిన మోడీ.. ఎవరినీ వదిలిపెట్టబోమని స్ట్రాంగ్ వార్నింగ్
దేశంలో తీవ్ర దుమారం రేపుతోన్న నీట్ పరీక్ష పత్రం లీక్ వ్యవహారంపై ప్రధాని మోడీ ఎట్టకేలకు స్పందించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో తీవ్ర దుమారం రేపుతోన్న నీట్ పరీక్ష పత్రం లీక్ వ్యవహారంపై ప్రధాని మోడీ ఎట్టకేలకు స్పందించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా మంగళవారం లోక్ సభలో మోడీ మాట్లాడుతూ.. నీట్ ఇష్యూపై రియాక్ట్ అయ్యారు. పేపర్ లీక్ ఘటనలను అడ్డుకునేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని చెప్పారు. యువత భవిష్యత్‌తో ఆడుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నీట్ పేపర్ లీక్ ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించామని.. విచారణ వేగంగా సాగుతోందని తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దేశ వ్యతిరేక చర్యలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేశిక్షింబోమని మోడీ ఈ సందర్భంగా తేల్చి చెప్పారు. కాగా, మోడీ ప్రసంగం మొదలుపెట్టగానే నీట్ ఇష్యూపై మాట్లాడాలని విపక్షాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు మోడీ లోక్ సభలో నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై పెదవి విప్పారు.