భారతదేశంలోనే మొట్టమొదటి వాటర్ మెట్రోను ప్రారంభించిన ప్రధాని మోడీ
భారతదేశపు మొట్టమొదటి వాటర్ మెట్రోను భారత ప్రధాని నరేంద్ర మోడీ.. కేరళలో ప్రారంభించారు.
దిశ, వెబ్‌డెస్క్: భారతదేశపు మొట్టమొదటి వాటర్ మెట్రోను భారత ప్రధాని నరేంద్ర మోడీ.. కేరళలో ప్రారంభించారు. ఈ వాటర్ మెట్రోలో ఎనిమిది ఎయిర్ కండిషన్డ్ బోట్లు ఉంటాయి. ఇవి కొచ్చి చూట్టూ ఉన్న పది చిన్న చిన్న దీవులను కలుపుతాయి. వాటర్ మెట్రోను ప్రారంభించిన ప్రధాని మోడీ.. "కొచ్చి యొక్క మౌలిక సదుపాయాలకు గణనీయమైన మెరుగుదల" అని పిలిచారు. అలాగే కేరళ సీఎం పినరయి విజయన్ కొచ్చి అభివృద్ధిని వేగవంతం చేసే "డ్రీమ్ ప్రాజెక్ట్" అని పేర్కొన్నారు.