కొత్త పార్లమెంట్‌లో ప్రధాని తొలి ప్రసంగం.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కీలక వ్యాఖ్యలు
మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం కొత్త పార్లమెంట్‌లో తొలి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ... పార్లమెంట్‌తో పాటు అసెంబ్లీల్లోనూ మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు అవుతుందని చెప్పారు.
దిశ, వెబ్‌డెస్క్: మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం కొత్త పార్లమెంట్‌లో తొలి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ... పార్లమెంట్‌తో పాటు అసెంబ్లీల్లోనూ మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు అవుతుందని చెప్పారు. SC, ST నియోజకవర్గాల్లో కూడా అమల్లో ఉంటుందని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై అనేక చర్చలు జరిగాయని.. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే మహిళా శక్తి పెరుగుతుందని తెలిపారు. సెప్టెంబర్ 19, 2023 చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త పార్లమెంట్‌లో ఆమోదించే మొదటి బిల్లు ఇదే అవుతుందని చెప్పారు. ఈ చట్టం చేసేందుకు తాము సంకల్పం తీసుకున్నామని.. ఏకగ్రీవంగా ఆమోదించాలని సభ్యులను ప్రధాని కోరారు. గతంలో అనేకసార్లు ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెట్టారని.. కానీ ఆమోదం పొందలేదని గుర్తుచేశారు. ఈ పవిత్ర కార్యం పూర్తి చేసేందుకు నన్ను ఈశ్వరుడు పంపాడని కీలక వ్యాఖ్యలు చేశారు.