పార్లమెంట్‌లో ప్రధాని మోడీ ఫైర్

భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ రోజు పార్లమెంట్‌లో జరిగిన చర్చలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గోన్నారు.

Update: 2024-12-14 14:27 GMT

దిశ, వెబ్ డెస్క్: భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ రోజు పార్లమెంట్‌లో జరిగిన చర్చలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య పండుగను ఘనంగా జరుపుకుంటున్నామని, ఇవి 75 ఏళ్ల ప్రజాస్వామ్యాన్ని వేడుకగా చేసుకునే ఆనంద క్షణాలు. దేశ ప్రజలు గర్వపడే అతిపెద్ద పండుగ అని ప్రధాని మోడీ గుర్తు చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ గత 75 ఏళ్లలో రాజ్యాంగంపై చేసిన దాడిని గుర్తు చేస్తూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అలాగే కాంగ్రెస్ పార్టీ.. సర్దార్ పటేల్‌ను అవమానించిందని. సర్దార్‌ పటేల్‌ను ప్రధాని కాకుండా కుట్రచేశారని.. నెహ్రూ అధికారం కోసమే సర్దార్ పటేల్‌ను అడ్డుకున్నారని.. కాంగ్రెస్ పార్టీని గాంధీ కుటుంబం కబ్జా చేసిందని తీవ్ర విమర్శలు చేశారు. ‘‘కాంగ్రెస్‌ పార్టీకి ఒక పదం అంటే చాలా ఇష్టం అని, వాళ్లకు ఇష్టమైన పదం- ‘జుమ్లా’ అని.. భారతదేశంలో అతిపెద్ద జుమ్లా కాంగ్రెస్ అని, దీనిని 4 తరాలుగా దేశంలో ఆచరణలో ఉంచారని.. ఈ జుమ్లా - 'గరీబీ హటావో' రాజకీయాల్లో వారికి సహాయపడింది కానీ పేదల పరిస్థితిని మెరుగు పరచలేదని ఈ సందర్భంగా పార్లమెంట్‌లో ప్రధాని మోడీ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు.


Similar News