ప్రతిపక్షాల కూటమి కన్వీనర్‌గా నితీష్ కుమార్.. తీవ్ర విమర్శలు చేసిన ప్రశాంత్ కిషోర్..
కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎర్పాటై I.N.D.I.A కూటమి మూడో మీటింగ్ ముంబైలో జరగనుంది.
దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎర్పాటై I.N.D.I.A కూటమి మూడో మీటింగ్ ముంబైలో జరగనుంది. ఈ మిటింగ్ లోనే బీహార్ సీఎం నితీష్ కుమార్‌ను I.N.D.I.A కూటమి కన్వీనర్‌గా నియమించాలనే యోచనలో పార్టీలు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో నితీష్ పై ప్రశాంత్ కిషోర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తన రాష్ట్రంతో సొంతంగా నిలబడలేని వ్యక్తి అని.. తన అడుగు పెట్టడానికి గ్యారెంటీ లేదని.. అలాంటి వ్యక్తి అతను ఏమి చేయగలడని ఎద్దేవ చేశాడు. జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ఐక్యత ను కాపాడే సత్తా నితీశ్ కుమార్ కు లేదని చెప్పుకొచ్చారు.