డిస్పూర్: అసోంలో పోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది సంయుక్తంగా చేపట్టిన అపరేషన్‌లో భారీగా మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం అసోం-నాగాలాండ్ సరిహద్దుల్లోని కర్బీ అంగ్లాంగ్ జిల్లాలో ఓ వాహానంలో రూ.20 కోట్ల విలువ చేసే ఐదు కేజీల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వాటిని సరఫరా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
పక్కా సమాచారం ఆధారంగానే ఈ సోదాలు చేసినట్లు అధికారులు తెలిపారు. సోదాల్లో వాహానాంలోని పైభాగంలోని సీక్రెట్ చాంబర్లో దీనిని గుర్తించినట్లు చెప్పారు. సీక్రెట్ చాంబర్ ను ప్రత్యేకంగా వెల్డింగ్ చేసి ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇది నాగాలాండ్ దిమాపూర్ నుంచి బయలుదేరినట్లు తెలిపారు.