మొరాకో భూకంపం పై స్పందించిన ప్రధాని.. అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా

మొరాకో దేశంలో 6.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించి 296 మంది మృత్యువాత పడగా.. 153 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా వారంతా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Update: 2023-09-09 05:05 GMT
మొరాకో భూకంపం పై స్పందించిన ప్రధాని.. అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: మొరాకో దేశంలో 6.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించి 296 మంది మృత్యువాత పడగా.. 153 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా వారంతా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై భారత ప్రధాని మోడీ స్పందించారు. భారీ భూకంపం కారణంగా మృతి చెందిన వారికి ప్రధాని మోడీ తన సంతాపం తెలిపారు. “మొరాకోలో భూకంపం కారణంగా ప్రాణాలు కోల్పోయినందుకు చాలా బాధపడ్డాను. ఈ విషాద సమయంలో, నా ఆలోచనలు మొరాకో ప్రజలతో ఉన్నాయి. తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి సంతాపం తెలుపుతున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఈ క్లిష్ట సమయంలో మొరాకోకు అన్ని విధాల సహాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.

Tags:    

Similar News