రూ. లక్ష కోట్లతో 112 హైవే ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోడీ
ఢిల్లీ-గురుగ్రామ్ మధ్య ట్రాఫిక్‌ను మెరుగుపరచడానికి, రద్దీని తగ్గించడానికి ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేలోని హర్యానా సెక్షన్‌ను
దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా సుమారు రూ. లక్ష కోట్ల రూపాయల విలువైన 112 జాతీయ రహదారుల ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. హర్యానాలోని గురుగ్రామ్ పర్యటన సందర్భంగా మోడీ, జాతీయ రహదారి-48పై ఢిల్లీ-గురుగ్రామ్ మధ్య ట్రాఫిక్‌ను మెరుగుపరచడానికి, రద్దీని తగ్గించడానికి సహాయపడే ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేలోని హర్యానా సెక్షన్‌ను ప్రారంభించారు. 8-లేన్ల ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే 19 కిలోమీటర్ల పొడవైన హర్యానా సెక్షన్‌ను నిర్మాణానికి దాదాపు రూ. 4,100 కోట్లతో నిర్మించారు. ఇందులో ఢిల్లీ-హర్యానా సరిహద్దు నుంచి బసాయి రైల్-ఓవర్-బ్రిడ్జ్ వరకు 10.2 కిలోమీటర్ల పొడవైన , బసాయి రైల్-ఓవర్-బ్రిడ్జ్ 8.7 కిలోమీటర్ల పొడవు ఉన్నాయి. ఇది ఢిల్లీలోని ఐజీఐ విమానాశ్రయం, గురుగ్రామ్ బైపాస్‌కు నేరుగా కనెక్టివిటీని కలిగి ఉంటుంది. ఇతర ప్రాజెక్టుల్లో నాగ్లోయి-నజఫ్‌గఢ్ రోడ్ నుంచి ఢిల్లీలోని సెక్టార్ 24 ద్వారకా సెక్షన్ వరకు 9.6 కిలోమీటర్ల పొడవైన ఆరు లేన్ల రహదారిని రూ. 4,600 కోట్లతో లక్నో రింగ్‌రోడ్డును అభివృద్ధి చేశారు. ఏపీలోని ఆనందపురం-పెందుర్తి-అనకాపల్లి సెక్షన్‌లో ఎన్‌హెచ్16లో రూ. 2,950 కోట్లతో, బెంగళూరు-కడప-విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే రూ.14,000 కోట్లు సహా హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెనిద్న ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా జాతీయ రహదారి నెట్‌వర్క్ అభివృద్ధికి ఎంతో దోహదపడతాయని, సామాజిక, ఆర్థిక అభివృద్ధి మెరుగుపడేందుకు, ఉపాధి పెరుగుదలకు, దేశవ్యాప్తంగా ప్రాంతాల మధ్య వాణిజ్యాన్ని పెంచుతుందని ప్రధాని మోడీ వెల్లడించారు.