చారిత్రాత్మక ఘట్టం.. పంబన్ కొత్త రైల్వే బిడ్జిని ప్రారంభించి జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ
భారత ప్రధాని మోడీ.. చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టారు. రూ. 535 కోట్లతో ఇటీవల కొత్తగా నిర్మించిన పంబన్ రైల్వే బిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోడీ జాతికి అంకితం చేశారు.
దిశ, వెబ్ డెస్క్: శ్రీలంక పర్యటన ముగించుకుని నేరుగా విమానంలో తమిళనాడు చేరుకున్న భారత ప్రధాని మోడీ (Indian Prime Minister Modi).. చారిత్రాత్మక ఘట్టానికి (Historic event) శ్రీకారం చుట్టారు. రూ. 535 కోట్లతో ఇటీవల కొత్తగా నిర్మించిన పంబన్ రైల్వే బిడ్జి (Pamban Railway Bridge)ని ప్రారంభించిన ప్రధాని మోడీ జాతికి అంకితం చేశారు. తమిళనాడులోని రామేశ్వరంలో భారతదేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జి (Vertical lift sea bridge) అయిన కొత్త పంబన్ రైల్వే బ్రిడ్జి ని ప్రారంభించారు. ఈ వంతెన పొడవు 2.5 కిలోమీటర్లు. ఇది రామేశ్వరం ద్వీపాన్ని భారత ప్రధాన భూభాగంతో అనుసంధానం చేస్తుంది. ఈ కొత్త వంతెన వల్ల రైలు ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా, ఈ ప్రాంతంలో ఆర్థిక వృద్ధికి కూడా దోహదపడనుంది. ఈ కొత్త వంతెన 1914లో నిర్మించబడిన పాత పంబన్ బ్రిడ్జి (Pamban Bridge)కి బదులుగా నిర్మించబడింది. ఎందుకంటే పాత వంతెన వాడుకలో ఉన్న సాంకేతికంగా పాతబడిపోయింది.
అలాగే ఆధునిక రైళ్లకు అనుగుణంగా లేదు. కొత్తగా నిర్మించిన బ్రిడ్జీను ఇది వర్టికల్ లిఫ్ట్ మెకానిజం (Vertical lift mechanism) తో రూపొందించారు. దీనివల్ల ఓడలు దిగువ నుండి సులభంగా ప్రయాణించవచ్చు. ఈ వంతెన 72 పిల్లర్లపై నిర్మించారు. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను కూడా తట్టుకునేలా డిజైన్ చేశారు. ఈ పంబన్ కొత్త రైల్వే బ్రిడ్జి ప్రారంభోత్సవం (Inauguration of the new railway bridge) సందర్భంగా ప్రధానమంత్రి మోడీ (Prime Minister Modi) మాట్లాడుతూ.. "భారతదేశ అభివృద్ధి యాత్రలో ఒక మైలురాయి"గా చెప్పారు. ఈ వంతెన రామేశ్వరం యాత్రికులకు, స్థానిక ప్రజలకు మెరుగైన కనెక్టివిటీని అందిస్తుందని, అలాగే ఈ ప్రాంతంలో పర్యాటకం, వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీతో పాటు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, రైల్వే అధికారులు. స్థానిక బీజేపీ నాయకులు నాయకులు పాల్గొన్నారు.