India vs Bharat controversy: రాజ్యాంగం చదవండి.. ‘భారత్’ అని రాసి ఉంది.. Jaishankar

‘ఇండియా’ పేరును భారత్‌గా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వాదనలపై విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ క్లారిటీ ఇచ్చారు.

Update: 2023-09-06 11:09 GMT
India vs Bharat controversy: రాజ్యాంగం చదవండి.. ‘భారత్’ అని రాసి ఉంది.. Jaishankar
  • whatsapp icon

న్యూఢిల్లీ : ‘ఇండియా’ పేరును భారత్‌గా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వాదనలపై విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ క్లారిటీ ఇచ్చారు. రాజ్యాంగంలో ‘‘భారత్’’ అనే పేరు గురించి ప్రస్తావన ఇప్పటికే ఉందని తేల్చి చెప్పారు. రాజ్యాంగంలో మన దేశాన్ని ఉద్దేశించి ఇండియాతో పాటు భారత్ అనే పదాన్ని కూడా వాడారని తెలిపారు.

ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్ బదులు ఆ దేశాల ప్రతినిధులు జీ20 సదస్సుకు వస్తున్నారని పేర్కొన్నారు. వాళ్లతో కీలక ఒప్పందాలు కుదిరే ఛాన్స్ ఉందని తెలిపారు.

Tags:    

Similar News