Brazil: బ్రెజిల్‌లో ఘోర విమాన ప్రమాదం.. వీడియో వైరల్

గ్లోబో న్యూస్ ప్రకారం విమానంలో 62 మంది ఉన్నట్టు తెలుస్తోంది.

Update: 2024-08-09 19:30 GMT
Brazil: బ్రెజిల్‌లో ఘోర విమాన ప్రమాదం.. వీడియో వైరల్
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: బ్రెజిల్‌లో ఘోర విమానం ప్రమాదం చోటుచేసుకుంది. విన్‌హెడోలో ఓ విమానం కుప్పకూలింది. మొత్తం 68 మంది ప్రయాణించగల సామర్థ్యం కలిగిన విమానంలో ఎంతమంది గాయపడ్డారు, మరణించారనే వివరాలు ఇంకా తెలియరాలేదు. గ్లోబో న్యూస్ ప్రకారం విమానంలో 62 మంది ఉన్నట్టు తెలుస్తోంది. వోపాస్ ఫ్లైట్ 2283గా గుర్తించబడిన విమానం బ్రెజిల్‌లోని విన్‌హెడోలో నేలపై పడిపోయిన వీడియోను బీఎన్ఓ న్యూస్ షేర్ చేసింది. సావో పాలో రాష్ట్ర అగ్నిమాపక దళం విన్‌హెడోలో విమానం కూలిపోయినట్టు సోషల్ మీడియాలో ధృవీకరించింది. ప్రమాద స్థలానికి ఏడుగురు సిబ్బందిని పంపినట్లు అధికారులు తెలిపారు. వోపాస్ ఫ్లైట్ 2283 బ్రెజిల్‌లోని కాస్కావెల్ నుంచి బ్రెజిల్‌లోని సావో పాలోకు ప్రయాణిస్తోంది. ఉదయం 11:50 గంటలకు కాస్కావెల్‌లో బయలుదేరిన విమానం మధ్యాహ్నం 1:40 గంటలకు సావోపాలోలో ల్యాండ్ కావాల్సి ఉంది. ఈ ప్రమాదం గురించి సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. 

Tags:    

Similar News