Monalisa:స్పెషల్ గెస్ట్‌గా ఫ్లైట్‌లో ఈవెంట్స్‌కి మోనాలిసా.. వైరలవుతోన్న ఫొటోస్!
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని ప్రయోగరాజ్(Prayag Raj)లో జరుగుతున్న మహాకుంభమేళా(Mahakumbh Mela)లో ఆకర్షించే కళ్లతో ఫేమస్ అయిన తేనెకళ్ల బ్యూటీ మోనాలిసా(Monalisa) గురించి తెలిసిందే

దిశ,వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని ప్రయోగరాజ్(Prayag Raj)లో జరుగుతున్న మహాకుంభమేళా(Mahakumbh Mela)లో ఆకర్షించే కళ్లతో ఫేమస్ అయిన తేనెకళ్ల బ్యూటీ మోనాలిసా(Monalisa) గురించి తెలిసిందే. మహాకుంభమేళలో పూసల దండలు, రుద్రాక్షలు అమ్ముకోవడానికి వచ్చి.. స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. అందమైన చిరునవ్వు, ఆకట్టుకునే కళ్లతో నెటిజన్లు ఫిదా అయ్యారు. ఆమె ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా ఓ రేంజ్‌లో వైరలయ్యాయి. అయితే మోనాలిసాకు సంబంధించి రోజుకో వార్త నెట్టింట వైరల్‌గా మారుతుంది.
కుంభమేళా బ్యూటీ మోనాలిసా(Monalisa)తో బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా(Director Sanoj Mishra) ‘‘ది డైరీ ఆఫ్ మణిపూర్’’ మూవీ తీస్తున్న విషయం తెలిసిందే. దీనికోసం ఆయన మోనాలిసాను అన్ని విధాలుగా ప్రిపేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వీరిద్దరూ కలిసి ఓ బ్రాండ్ ఈవెంట్ కోసం కేరళ(Kerala) వెళ్లారు. ఆయనే స్వయంగా ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లగా ఎస్కలేటర్‌పై వెళ్లడంలో మోనాలిసా కాస్త ఇబ్బంది పడ్డారు. ఈవెంట్‌లో మోనాలిసాతో దిగిన ఫొటోను డైరెక్టర్ సనోజ్ మిశ్రా షేర్ చేశారు. దీంతో ప్రజెంట్ ఆ ఫొటో సోషల్ మీడియా(Social Media)లో వైరలవుతోంది.