ఆర్టికల్ 370 రద్దు తీర్పును సమీక్షించాలని పిటిషన్: కొట్టివేసిన సుప్రీంకోర్టు

రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది.

Update: 2024-05-21 17:56 GMT
ఆర్టికల్ 370 రద్దు తీర్పును సమీక్షించాలని పిటిషన్: కొట్టివేసిన సుప్రీంకోర్టు
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. గతేడాది డిసెంబర్ 11న ఇచ్చిన తీర్పులో ఎలాంటి తప్పు లేదని భారత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్, న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, బీఆర్ గవాయ్, సూర్యకాంత్, ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు రివ్యూ పిటిషన్లను కొట్టి వేసింది. రివ్యూ పిటిషన్‌ను బహిరంగ కోర్టులో జాబితా చేయాలని, వ్యక్తిగతంగా హాజరై వాదించడానికి అనుమతి లేదని తెలిపింది. రివ్యూ పిటిషన్లను పరిశీలించిన తర్వాత గత తీర్పులో ఎలాంటి లోపం కనపడలేదని పేర్కొంది. గతంలో జమ్మూ కశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370 తొలగింపును సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 2024 సెప్టెంబర్ 30 లోగా జమ్మూ కశ్మీర్ శాసనసభకు ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని భారత ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. అయితే దీనిని సవాల్ చేస్తూ పలువురు రివ్యూ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే వీటిపై విచారణ చేపట్టిన ధర్మాసనం వాటిని కొట్టి వేసింది.

Tags:    

Similar News