Kejriwal: క్రైం క్యాపిటల్ గా ఢిల్లీ మారేలా కన్పితోంది.. అమిత్ షాకు కేజ్రీవాల్ లేఖ

ఢిల్లీ (Delhi)లో జరుగుతున్న నేరాపలపై కేంద్రహోంమంత్రి అమిత్ షాకు(Amit Shah) ఆమ్ ఆద్మీపార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) లేఖ రాశారు.

Update: 2024-12-14 11:17 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ (Delhi)లో జరుగుతున్న నేరాపలపై కేంద్రహోంమంత్రి అమిత్ షాకు(Amit Shah) ఆమ్ ఆద్మీపార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) లేఖ రాశారు. ఢిల్లీలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై లేఖలో పేర్కొన్నారు. శాంతిభద్రతల సమస్యను వివరించేందుకు తనకు సమయం ఇవ్వాలని కోరారు. ‘‘భారత్‌లోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే అత్యధికంగా మహిళలపై ఢిల్లీలోనే నేరాలు జరుగుతున్నాయి. ఆ విషయంలో తొలి స్థానంలో ఉంది. హత్యలు, దోపిడీలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. నేర గణాంకాలను పరిశీలిస్తే ‘క్రైం క్యాపిటల్ గా’ మన దేశం, ఢిల్లీ మారేలా ఉన్నాయి. పాఠశాలలు, విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు తరచూ వస్తున్నాయి. డ్రగ్స్‌ సంబంధిత నేరాలు 300 శాతానికి పైగా పెరిగాయి’’ అని కేజ్రీవాల్‌ ఆందోళన వ్యక్తంచేశారు.

బాంబు బెదిరింపులు

బాంబు బెదిరింపుల కారణంగా విద్యార్థుల తల్లిదండ్రులు భయపడుతున్నారని కేజ్రీవాల్ అన్నారు. పట్టపగలే హత్యలు, కాల్పులు, కిడ్నాప్‌లు జరుగుతున్నాయని అన్నారు. ఢిల్లీలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఈ వైఫల్యాల కారణంగానే ఢిల్లీకి ‘రేప్‌ క్యాపిటల్‌’, ‘క్రైం క్యాపిటల్‌’ అనే కొత్త పేర్లు వస్తున్నాయని అన్నారు. ఢిల్లీలోని పరిస్థితి గురించి మరింత స్పష్టంగా వివరించేందుకు టైం ఇవ్వాలని అమిత్ షాని కోరారు. ఇకపోతే, ఇటీవలే ఢిల్లీలో మార్నింగ్ వాక్ కు వెళ్లిన సునీల్ జైన్ అనే వ్యాపారని దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. మరోచోట టాయిలెట్ విషయంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి కత్తిపోట్లకు గురై చనిపోయాడు. మరో దగ్గర కుమారుడు తల్లిని దారుణంగా హత్య చేశారు. ఈ విషయాల గురించే అమిత్ షాకు కేజ్రీవాల్ లేఖ రాశారు.

Tags:    

Similar News