మారుమూల గ్రామంలో డ్రోన్‌తో పింఛన్
ఒడిశాలోని మారుమూల గ్రామంలో ఉన్న వికలాంగులకు డ్రోన్ ద్వారా పించన్ అందజేశారు. దీనికి సంబంధించిన వీడియోను అధికారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: ఒడిశాలోని మారుమూల గ్రామంలో ఉన్న వికలాంగులకు డ్రోన్ ద్వారా పించన్ అందజేశారు. దీనికి సంబంధించిన వీడియోను అధికారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియలో ఒడిశాలోని నువాపాడా జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో నివసించే వికలాంగుడైన హెతారం సత్నామీకి డ్రోన్ ద్వారా ఈ నెల ప్రభుత్వ పింఛను అందింది. సత్నామి తన పింఛను కోసం ప్రతి నెలా 2 కి.మీ అడవి గుండా ప్రయాణించాల్సి వస్తోందన్నారు. ఈ సందర్భంగా ఆ గ్రామ సర్పంచ్ సరోజ్ అగర్వాల్ మాట్లాడుతూ.. సత్నామీకి ఎదురైన కష్టాలను తెలుసుకుని ఆన్‌లైన్‌లో డ్రోన్‌ను కొనుగోలు చేసినట్లు తెలిపారు.