కుల ఆధారికి జనగణన పై పాట్నా హైకోర్టు స్టే
బీహార్ ప్రభుత్వానికి పాట్నా హైకోర్టు షాక్ ఇచ్చింది. బీహార్ రాష్ట్రంలో జరుగుతున్న కుల ఆధారిత జనగణను ఆపేయాలని పాట్నా హైకోర్టు గురువారం మధ్యంతర స్టే విధించింది.
దిశ, వెబ్‌డెస్క్: బీహార్ ప్రభుత్వానికి పాట్నా హైకోర్టు షాక్ ఇచ్చింది. బీహార్ రాష్ట్రంలో జరుగుతున్న కుల ఆధారిత జనగణను ఆపేయాలని పాట్నా హైకోర్టు గురువారం మధ్యంతర స్టే విధించింది. విచారణలో పిటిషనర్ల తరఫు న్యాయవాది దిను కుమార్ మాట్లాడుతూ సర్వేలు నిర్వహించే హక్కు రాష్ట్ర ప్రభుత్వ పరిధికి మించినదని అన్నారు. అలాగే ప్రజా సంక్షేమం కోసం ప్రణాళికలు రూపొందించేందుకు ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు రాష్ట్రం తరఫున అడ్వకేట్ జనరల్ పీకే షాహి తెలిపారు.