Padma awardee: కోల్‌కతా ఘటనపై సత్వర న్యాయం చేయాలి.. ప్రధాని మోడీకి పద్మ అవార్డు గ్రహీతల లేఖ

కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై జరిగిన అత్యాచార ఘటనపై సత్వర న్యాయం చేయాలని, ఈ విషయంలో ప్రధాని వ్యక్తి గతంగా జోక్యం చేసుకోవాలని కోరుతూ సుమారు 70 మంది పద్మ అవార్డు గ్రహీతలు ఆదివారం మోడీకి లేఖ రాశారు.

Update: 2024-08-18 14:53 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై జరిగిన అత్యాచార ఘటనపై సత్వర న్యాయం చేయాలని, ఈ విషయంలో ప్రధాని వ్యక్తి గతంగా జోక్యం చేసుకోవాలని కోరుతూ సుమారు 70 మంది పద్మ అవార్డు గ్రహీతలు ఆదివారం మోడీకి లేఖ రాశారు. ‘మేము ఇటీవల కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జరిగిన భయంకరమైన సంఘనపై తీవ్ర ఆందోళన చెందుతున్నాం. ఈ పరిస్థితిని పరిష్కరించడానికి మీరు వ్యక్తి గతంగా జోక్యం చేసుకోవాలి. ఇటువంటి క్రూరత్వ చర్యలు వైద్య నిపుణుల సేవ చేయకుండా హరించివేస్తాయి. ముఖ్యంగా మహిళలు, బాలికలు, ఆరోగ్య సంరక్షణ నిపుణులపై హింసను పరిష్కరించాల్సిన తక్షణ అవసరం ఉంది’ అని లేఖలో పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి సంఘీభావం తెలియజేస్తున్నట్టు తెలిపారు. ఈ లేఖపై సంతకం చేసిన వారిలో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మాజీ డైరెక్టర్ రణదీప్ గులేరియా, మెదంతా ది మెడిసిటీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, మహాజన్ ఇమేజింగ్ వ్యవస్థాపకుడు నరేష్ ట్రెహాన్, ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇనిస్టిట్యూట్ చైర్మన్ హర్ష్ మహాజన్ తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News