హత్రాస్ తొక్కిసలాట ఘటనపై ఓవైసీ కామెంట్స్.. ప్రభుత్వానికి కీలక విజ్ఞప్తి

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో 107 మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే.

Update: 2024-07-02 14:46 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో 107 మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే. మరో 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో చాలా మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే, ఈ ఘటనపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో తాజాగా మీడియాతో మాట్లాడారు. 'హత్రాస్‌లో చోటుచేసుకున్న ఘటన బాధాకరమన్నారు.

ఘటన ఎలా జరిగింది అనే దానిపై సరైన దర్యాప్తు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటనలో గాయపడినవారికి సరైన చికిత్స అందుతుందని ఆశించారు. కాగా, తొక్కిసలాట ఘటనపై యూపీ ప్రభుత్వం విచారణ చేపట్టింది. ప్రమాదానికి గల కారణాలు, కార్యక్రమ నిర్వహణ పై దర్యాప్తు చేయనున్నారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 పరిహారం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.

Tags:    

Similar News