Uttarapradesh: ప్రభుత్వోద్యోగులకు యోగి సర్కార్ అల్టిమేటం

ఆదేశాలను పాటించకపోతే 13 లక్షల మందికి పైగా ఉద్యోగులు తమ జీతాలను కోల్పోయే ప్రమాదం ఉంది.

Update: 2024-08-22 17:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు కీలక అదేశాలిచ్చింది. ఆ ఆదేశాలను పాటించకపోతే 13 లక్షల మందికి పైగా ఉద్యోగులు తమ జీతాలను కోల్పోయే ప్రమాదం ఉంది. దీనికి కారణం.. యూపీ ప్రభుత్వ ఉద్యోగులు తమ చర, స్థిరాస్తుల వివరాలను ప్రభుత్వ పోర్టల్ 'మానవ్ సంపద'లో ఆగష్టు 31లోగా ప్రకటించాలని, లేకుంటే వారి ఈ నెల జీతాలు చెల్లించబోమని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిబంధనలను పాటించకపోవడం వల్ల ఉద్యోగుల పదోన్నతులపై కూడా ప్రభావం ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఆర్డర్‌ను యూపీ ప్రభుత్వం గతేడాది ఆగష్టులోనే జారీ చేసింది. దీనికి 2023, డిసెంబర్ 31 వరకు గడువు ఇచ్చింది. దీన్ని పలు దశల్లో పొడిగించిన తర్వాత తాజాగా ఆగష్టు 31కి వాయిదా వేసింది. ప్రస్తుతం యూపీలో 17,88,429 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులున్నారు. ఇందులో 26 శాతం మంది ఉద్యోగులు మాత్రమే తమ ఆస్తుల వివరాలను వెల్లడించారు. ఇంకా 13 లక్షల మంది తమ వివరాలు పేర్కొనలేదు. ఇప్పటికే పలుమార్లు గడువు పెంచినందున, తాజా ఆదేశం అల్టిమేటంగా వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.

Tags:    

Similar News