వరద నీటిలో కొట్టుకుపోయిన వందల కొద్దీ సిలిండర్లు

ఉత్తరభారతంలో వర్షాలు భీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వర్షాల వల్ల ఇళ్లల్లోకి వరద నీరు వచ్చి ప్రజలు ఇబ్బందిపడ్డారు.

Update: 2023-07-24 10:18 GMT
వరద నీటిలో కొట్టుకుపోయిన వందల కొద్దీ సిలిండర్లు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరభారతంలో వర్షాలు భీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వర్షాల వల్ల ఇళ్లల్లోకి వరద నీరు వచ్చి ప్రజలు ఇబ్బందిపడ్డారు. ఇక వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కార్లు, బైక్ లు వంటి వాహనాలు కొట్టుకుపోయాయి. కాగా తాజాగా గుజరాత్ లోని నవ్‌సారిలో 100కి పైగా గ్యాస్ సిలిండర్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. అయితే అవన్నీ ఖాళీ సిలిండర్లే కావడం గమనార్హం. అందుకే అవి వరదనీటిలో తేలియాడుతూ కనిపించాయి. ఇక గుజరాత్ లో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ సోమవారం వెల్లడించింది. ఇప్పటికే దక్షిణ గుజరాత్ లోని పలు జిల్లాలు, సౌరాష్ట్ర-కచ్ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Full View

Tags:    

Similar News