Sambhal : సంభల్‌లోకి బయటి వ్యక్తుల ప్రవేశంపై బ్యాన్ డిసెంబరు 10 వరకు పొడిగింపు

దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తరప్రదేశ్‌లోని సంభల్‌(Sambhal) జిల్లా కేంద్రంలో ఉన్న మొఘల్ కాలం నాటి షాహీ జామా మసీదు సర్వే వ్యవహారంలో ఉద్రిక్తతలు ఇంకా తగ్గలేదు.

Update: 2024-11-30 09:56 GMT
Sambhal : సంభల్‌లోకి బయటి వ్యక్తుల ప్రవేశంపై బ్యాన్  డిసెంబరు 10 వరకు పొడిగింపు
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తరప్రదేశ్‌లోని సంభల్‌(Sambhal) జిల్లా కేంద్రంలో ఉన్న మొఘల్ కాలం నాటి షాహీ జామా మసీదు సర్వే వ్యవహారంలో ఉద్రిక్తతలు ఇంకా తగ్గలేదు. ఈ తరుణంలో సంభల్‌లో పర్యటించేందుకు 15 మంది సభ్యుల సమాజ్‌వాదీ పార్టీ టీమ్‌(Samajwadi party) బయలుదేరింది. ప్రస్తుత పరిస్థితుల్లో సంభల్‌లో రాజకీయ పార్టీల నేతలు పర్యటిస్తే ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయని, శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసు వర్గాలు ఇచ్చిన నివేదికతో జిల్లా అధికార యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది.

సంభల్‌లోకి బయటి వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజాప్రతినిధుల ప్రవేశంపై విధించిన నిషేధాన్ని డిసెంబరు 10 వరకు పొడిగించింది. ఈ కేటగిరీల వారు ఎవరైనా సంభల్‌లోకి వెళ్లాలని భావిస్తే.. ముందుగా జిల్లా అధికార యంత్రాంగం నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. సమాజ్‌వాదీ పార్టీ రక్షిస్తున్న కొందరు క్రిమినల్స్ వల్లే నవంబరు 24న సంభల్‌లో పోలీసులు, ఓ వర్గం వారి మధ్య ఘర్షణ జరిగిందని అధికార బీజేపీ ఆరోపిస్తోంది. 

Tags:    

Similar News