మరణంలోనూ మానవత్వం.. 8 మంది అవయవదానం

Update: 2023-03-31 13:37 GMT

భోపాల్: ఇండోర్ ఆలయ ప్రమాదంలో మరణించన వారి కుటుంబ సభ్యులు మంచి మనసును చాటుకున్నారు. ఈ ఘటనలో మరణించిన 8 మంది అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. మృతుల చర్మం, కళ్లు ఇచ్చేందుకు అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. శ్రీరామనవమి రోజున బెలేశ్వర్ మహదేవ్ ఝూలేలాల్ ఆలయంలో బావిపై కప్పు కూలిన ఘటనలో భారీగా మరణాలు చోటుచేసుకున్నాయి.

ముందుగా 14 మంది మరణించినట్లు ప్రకటించినటప్పటికీ.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన వారి సంఖ్య 36కు చేరిందని అధికారులు తెలిపారు. 14 మందిని రక్షించినట్లు చెప్పారు. కాగా, సీఎం చౌహన్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50,000 ఇవ్వనున్నట్లు తెలిపారు. ఘటనపై న్యాయపరమైన విచారణకు సీఎం ఆదేశించారు. ఆలయ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News