Elon Musk: చాట్‌జీపీటీ ఓపెన్‌ ఏఐపై కోర్టును ఆశ్రయించిన ఎలన్ మస్క్..!

ప్రముఖ జనరేటివ్‌ ఏఐ చాట్‌బాట్‌ చాట్‌జీపీటీ (ChatGPT) మాతృ సంస్థ ఓపెన్‌ ఏఐ(OpenAI)పై టెస్లా సీఈఓ(Tesla CEO) ఎలన్ మస్క్(Elon Musk) తన న్యాయపోరాటాన్ని ఉదృతం చేశారు.

Update: 2024-12-01 15:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ జనరేటివ్‌ ఏఐ చాట్‌బాట్‌ చాట్‌జీపీటీ(ChatGPT) మాతృ సంస్థ ఓపెన్‌ ఏఐ(OpenAI)పై  టెస్లా సీఈఓ(Tesla CEO) ఎలన్ మస్క్(Elon Musk) తన న్యాయపోరాటాన్ని ఉదృతం చేశారు. మార్కెట్లో గుత్తాధిపత్యం కోసం మైక్రోసాఫ్ట్(Microsoft), ఓపెన్ ఏఐ(OpenAI) ప్రయత్నిస్తున్నాయని పేర్కొంటూ కాలిఫోర్నియా(California)లోని నార్త్రర్న్ డిస్ట్రిక్ట్ కోర్టు(Northern District Court)లో పిటిషన్ దాఖలు చేశారు. ఓపెన్‌ ఏఐ అనైతిక‌ వ్యాపార విధానాల‌ను అవ‌లంబిస్తోంద‌ని, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్(AI) ఫలాలు ప్రజలకు దక్కాలనే అసలు లక్ష్యం నుంచి ప‌క్క‌కు త‌ప్పుకొని ఓపెన్‌ ఏఐ లాభాల కోసం ప‌నిచేసే సంస్థ‌గా మార‌కుండా నిలువ‌రించాల‌ని తన పిటిషన్ లో కోరారు.

అలాగే ప్ర‌త్య‌ర్థి ఏఐ సంస్థలకు నిధులు(Funds) లభించకుండా, ఇతర సంస్థ‌ల్లో పెట్టుబ‌డులు(Investments) పెట్ట‌కుండా ఇన్వెస్ట‌ర్ల‌ను ఓపెన్‌ ఏఐ అడ్డుకుంటోంద‌ని, మైక్రోసాఫ్ట్‌తో ర‌హ‌స్య స‌మాచారాన్ని పంచుకుంటోందని అందులో పేర్కొన్నారు. కాగా ఓపెన్‌ ఏఐ కో-ఫౌండర్లలో(Co-Founders) ఎలన్ మస్క్ కూడా ఒకరు. 2015 నుంచి 2018 వరకు మస్క్ ఓపెన్‌ ఏఐలో పని చేశారు. తర్వాత కొన్ని కారణాల రీత్యా దీన్ని వీడి సొంతంగా 'ఎక్స్ఏఐ(XAI)' ని స్థాపించారు.

Tags:    

Similar News