సుప్రీంకోర్టు వద్ద భారీ పేలుళ్లు.. ఒకరు మృతి
బ్రెజిల్ రాజధాని బ్రసీలియాలో ఉన్న సుప్రీంకోర్టు వద్ద భారీ పేలుళ్లు జరిగాయి. రెండుసార్లు పేలుళ్లు జరగ్గా ఒకరు మృతి చెందినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
దిశ, వెబ్ డెస్క్: సుప్రీంకోర్టు (Supreme Court) వద్ద భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో ఒకరు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటన బ్రెజిల్ రాజధాని బ్రసీలియా(Brasília)లో జరిగింది. రెండుసార్లు పేలుళ్లు జరిగాయని అధికారులు తెలిపారు. బ్రెజిల్ సుప్రీంకోర్టు (Brazil Supreme Court) వద్ద పేలుళ్ల శబ్ధం వినగానే సిబ్బంది అప్రమత్తమయ్యారు. కోర్టు లోపలున్న జడ్జిలు, ఇతర సిబ్బందిని అధికారులు ఖాళీ చేయించారు. కోర్టు పనివేళలు ముగిసిన వెంటనే భారీగా పేలుళ్లు జరిగాయని ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. కాగా.. చనిపోయిన వ్యక్తి ఎవరన్న విషయం తెలియాల్సి ఉంది. ఈ పేలుళ్లకు పాల్పడింది ఎవరన్న దానిపై అక్కడి పోలీసులు విచారణ చేస్తున్నారు.