ఢిల్లీలో మరోసారి ఉద్రిక్తత.. రెజ్లర్ల నిరసనకు పెరుగుతోన్న మద్దతు
ఢిల్లీలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెజ్లర్లకు మద్దతుగా సోమవారం భారతీయ కిసాన్ యూనియన్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెజ్లర్లకు మద్దతుగా సోమవారం భారతీయ కిసాన్ యూనియన్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. జంతర్ మంతర్ వద్దకు వెళ్లకుండా పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను రైతులు తొలగించారు. ముళ్ల కంచెలను సైతం లాగి పక్కకు పడేశారు. లైంగిక వేధింపులకు పాల్పడిన డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా వారిని తోచుకుని ముందుకెళ్లి నిరసన వ్యక్తం చేశారు.
కాగా ఢిల్లీ జంతర్ వద్ద 10 రోజులుగా రెజర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెజర్లను లైంగికంగా వేధించిన బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వీరికి పలు రైతు సంఘాలు మద్దతు తెలిపాయి. ఇందులో భాగంగా జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే వీరిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఆ ప్రాంతంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంటోంది.
Read more:
200 కిలోల భారీ కేక్ ఐసింగ్ నిర్మాణంతో ప్రపంచ రికార్డు సృష్టించిన మహిళ