Fire cracker: పందెం కాసి ఫైర్‌క్రాకర్‌పై కూర్చున్న వ్యక్తి
కొత్త ఆటో కోసం పందెం కాసి ఫైర్ క్రాకర్ పై కూర్చుని ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. శక్తివంతమైన ఫైర్ క్రాకర్ పేలడంతో కిందపడి మరణించాడు.
దిశ, నేషనల్ బ్యూరో: కొత్త ఆటో కోసం పందెం కాసి ఫైర్ క్రాకర్(Fire cracker) పై కూర్చుని ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. శక్తివంతమైన ఫైర్ క్రాకర్ పేలడంతో కిందపడి మరణించాడు. దీపావళి(Diwali) రోజున బెంగళూరులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా(Viral Video)లో వైరల్ అయింది.
బెంగళూరుకు చెందిన 32 ఏళ్ల సబరీశ్, ఆయన మిత్రులు దీపావళి నాడు మద్యపానం సేవించి బాణాసంచా కాల్చడానికి వీధిలోకి వచ్చారు. అందరూ మద్యంమత్తులోనే ఉన్నారు. కార్డ్‌బోర్డ్ బాక్స్ కింద శక్తివంతమైన బాంబ్ పెట్టి.. బాంబ్ కాల్చినప్పుడు బాక్స్ పై కూర్చుని తట్టుకున్నవారికి కొత్త ఆటోరిక్షా కొనిస్తామనే బెట్ వేసుకున్నారు. అందుకు సబరీశ్ అంగీకరించాడు. బాంబ్ తోకను అంటించాక బాక్స్ పై కాసేపు వెయిట్ చేసిన సబరీశ్.. బాంబ్ పేలగానే వెనక్కి పడిపోయాడు. ఇక లేవలేదు. పేలుడు ధాటికి సబరీశ్ ఇంటర్నల్ ఆర్గన్స్ దెబ్బతిని ఉంటాయని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.